Home > తెలంగాణ > విద్యార్థులకు గుడ్ న్యూస్.. వెల్ఫేర్ హాస్టల్స్లో డైట్ ఛార్జీలు పెంపు

విద్యార్థులకు గుడ్ న్యూస్.. వెల్ఫేర్ హాస్టల్స్లో డైట్ ఛార్జీలు పెంపు

విద్యార్థులకు గుడ్ న్యూస్.. వెల్ఫేర్ హాస్టల్స్లో డైట్ ఛార్జీలు పెంపు
X

విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని రకాల వసతి గృహాల్లో డైట్ ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఈ నిర్ణయంపై ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల గురుకులాల్లో చదువుకునే పిల్లలకు మరింత నాణ్యమైన భోజనం లభిస్తుందని తెలిపారు. ఈ మేరకు పెరిగిన డైట్ చార్జీల వివరాలు ఎలా ఉన్నాయంటే..

ప్రస్తుతం 3 నుంచి 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ.950 ఇస్తుండగా.. దాన్ని రూ.1,200లకు పెంచారు. 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ. 1100 నుంచి రూ.1,400లకు, ఇంటర్ నుంచి పీజీ చదువుతున్న విద్యార్థులకు రూ.1500 నుంచి రూ.1,875కు పెంచింది. పెరిగిన ఛార్జీలు జులై నెల నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.


Updated : 22 July 2023 10:29 PM IST
Tags:    
Next Story
Share it
Top