Home > తెలంగాణ > ధరణితో భూమిపై రైతులకు సంపూర్ణ అధికారం : కేసీఆర్

ధరణితో భూమిపై రైతులకు సంపూర్ణ అధికారం : కేసీఆర్

ధరణితో భూమిపై రైతులకు సంపూర్ణ అధికారం : కేసీఆర్
X

ధరణి పోర్టల్తో రాష్ట్రంలో అద్భుతాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణితో భూమిపై రైతులకు సంపూర్ణ అధికారం ఇచ్చామని చెప్పారు. ధరణి రాకముందు భూమిపై ఎంతో మంది అధికారులకు అధికారం ఉండేదని.. కానీ ధరణి వచ్చాక ఆ సిస్టం మొత్తం పోయిందన్నారు. భూమి హక్కు మార్చే అధికారం రైతుకు తప్ప ఎవరికీ లేదని స్పష్టం చేశారు. వీఆర్వో వ్యవస్థ ఉన్నప్పుడు భూములపై గందరగోళ పరిస్థితి ఉండేదని.. కాని ధరణి వచ్చాక రైతులకు తెలియకుండా భూమి వేరే వాళ్ల పేర్ల మీద చేసే అవకాశమే లేదన్నారు.

భువనగిరి డీసీసీ ప్రెసిడెంట్ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణితో భూమి సేఫ్గా ఉండడంతోపాటు ప్రభుత్వ నగదు సాయం, ధాన్యం డబ్బులు నేరుగా అకౌంట్లో పడుతాయని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో 2 కోట్ల 75 లక్షల ఎకరాల భూమి ఉంటే.. కోటీ 56లక్షల ఎకరాలు ధరణిలో ఎంటరైందన్నారు. కొన్ని సమస్యలు రావడం మామూలే అని.. దానిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో భూములు విలువలు ఎన్నో రెట్లు పెరిగాయని చెప్పారు.

ఏపీ ఆగమైంది..

గతంలో తెలంగాణ రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని.. ప్రస్తుతం వారి పరిస్థితి ఎంతో మెరుగుపడిందన్నారు. ఎటూ చూసిన వరికుప్పలే కన్పిస్తున్నాయని చెప్పారు. గత సీఎంలు 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదని సీఎం ప్రశ్నించారు. రైతులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా కరెంట్ ఇస్తున్నామని.. ఈ స్థాయిలో విద్యుత్ ఇవ్వాలంటే దిల్లుండాలని అన్నారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి మొత్తం ఆగమైందని విమర్శించారు.

నేను జిమ్మేదారి..

అనిల్ రెడ్డి రాజకీయ భవిష్యత్పై ఆందోళన అవసరం లేదని.. ఆయన భవిష్యత్కు తాను జిమ్మేదారి అని కేసీఆర్ తెలిపారు. అనిల్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి కలిసి కట్టుగా పనిచేసి భువనగిరి జిల్లాను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. పదవులు శాశ్వతం కాదని.. అభివృద్ధే శాశ్వతమన్నారు. బస్వాపూర్ ప్రాజెక్టుతో భువనగిరి జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని చెప్పారు.

Updated : 24 July 2023 4:09 PM GMT
Tags:    
Next Story
Share it
Top