Home > తెలంగాణ > సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన సీఎం

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన సీఎం

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన సీఎం
X

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రూ.183కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి నిర్మాణానికి పునాదిరాయి వేశారు. కార్యక్రమంలో మంత్రి మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, మానిక్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి , టీఎస్ఎంఐడీ సీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన నేత సీఎం కేసీఆర్ అని..రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏమి కావాలో తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు వెళ్లాల్సిన పని లేదన్నారు. సింగూరు జలాలను సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు అందిస్తామని మంత్రి అన్నారు. తెలంగాణ ఆచరిస్తుంటే దేశం అనుసరిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని.. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు.







Updated : 22 Jun 2023 3:08 PM IST
Tags:    
Next Story
Share it
Top