Home > తెలంగాణ > నిమ్స్‌ కొత్త బ్లాక్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

నిమ్స్‌ కొత్త బ్లాక్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

నిమ్స్‌ కొత్త బ్లాక్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
X

హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్లో కొత్త బ్లాక్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కొత్త భవనానికి దశాబ్ది బ్లాక్ అని నామకరణం చేశారు. రెండు వేల పడకలతో ఈ నిర్మాణం చేపడుతున్నారు. రూ. 1571 కోట్లతో 32 ఎకరాల స్థలంలో కొత్త బ్లాక్ నిర్మాణం చేయనున్నారు. కొత్త భవనంలో ఓపీ, ఎమర్జెన్సీ కోసం ప్రత్యేక బ్లాకులు నిర్మించాలని నిర్ణయించారు. దీనిలో 32 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 6 మేజర్ మాడ్యులర్ థియేటర్లు నిర్మిస్తారు. ఈ నిర్మాణంతో దేశంలో అత్యధిక సూపర్‌ స్పెషాలిటీ పడకలు ఉన్న దవాఖానగా నిమ్స్‌ ముందు వరుసలో నిలువన్నది. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు.



ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో 1800 సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులో ఉండగా.. నిత్యం ఆసుపత్రి రోగులతో కిక్కిరుస్తున్న పరిస్థితి. దీనికి తోడు అన్ని రకాల వైద్య సేవలు అందుతున్న నిమ్స్​లో మాతాశిశు వైద్యం అందుబాటులో ఉంటే మంచిదని భావించిన సర్కారు.. ఇటీవలే నిమ్స్ ప్రాంగణంలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ బ్లాక్​కి సైతం శంకుస్థాపన చేసింది. ఇక దశాబ్ది ఉత్సవాల వేళ రూ.1.571 కోట్లతో 32 ఎకరాల విస్తీర్ణంలో నూతన బ్లాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నూతన భవన సముదాయంలో అందుబాటులోకి వచ్చే పడకలతో కలిపి నిమ్స్​లో బెడ్స్ సంఖ్య 4000కి చేరనున్నాయి. ఫలితంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని సర్కారు భావిస్తోంది.





Updated : 14 Jun 2023 7:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top