Home > తెలంగాణ > గజ్వేల్కు గుడ్ బై.. ఈసారి కేసీఆర్ పోటీ ఎక్కడ్నుంచంటే..?

గజ్వేల్కు గుడ్ బై.. ఈసారి కేసీఆర్ పోటీ ఎక్కడ్నుంచంటే..?

గజ్వేల్కు గుడ్ బై.. ఈసారి కేసీఆర్ పోటీ ఎక్కడ్నుంచంటే..?
X

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీఆర్ఎస్ వ్యూహాలకు మరింత పదునుపెడుతోంది. హ్యాట్రిక్పై కన్నేసిన సీఎం కేసీఆర్ ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో గజ్వేల్కు గుడ్ బై చెప్పి కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సర్వే రిపోర్టుల ఆధారంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సర్వే రిపోర్టు ఆధారంగా

అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గాలవారీగా సిట్టింగులకు సంబంధించి ఇప్పటికే సర్వే రిపోర్టులు సిద్ధం చేయించిన ముఖ్యమంత్రి ఆ నివేదికల ఆధారంగా టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే కామారెడ్డిలో నిర్విహంచినసర్వేలో ఎమ్మెల్యే గంప గోవర్థన్ పనితీరు ఏ మాత్రం బాగోలేదని తేలినట్లు తెలుస్తోంది. గంప గోవర్థన్ కు మళ్లీ టికెట్ ఇవ్వడం, అభ్యర్థిని మార్చడం, కేసీఆర్ స్వయంగా పోటీ చేయడం తదితర అంశాలపై స్థానికుల అభిప్రాయాలు తీసుకోగా మెజార్టీ జనం గంపను మళ్లీ బరిలో దింపితే చిత్తుగా ఓడిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ సీఎం కేసీఆర్ స్వయంగా కామారెడ్డి నుంచి పోటీ చేస్తే బ్రహ్మరథం పడతామని చెప్పినట్లు సమాచారం.

గంపపై స్థానికుల ఆగ్రహం

గంప గోవర్థన్పై స్థానికుల ఆగ్రహానికి చాలా కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేడర్ను దూరం పెట్టడం, ఆయన అనుచరుల వ్యవహారశైలి, డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయకపోవడం, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తదితర అంశాలపై స్థానికులు ఆయనపై కోపంగా ఉన్నారు. సర్వే రిపోర్టులోనూ ఈ విషయం తేలడం, ఆ నివేదికను సీరియస్గా తీసుకున్నకేసీఆర్.. కామారెడ్డి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.కేసీఆర్ ఆలోచన వెనుక మరికొన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి పొరుగున ఉన్న మరో నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ వీక్గా ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి కామారెడ్డి నుంచి బరిలో దిగితే పక్కనున్న రామాయంపేట, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్ తో పాటు జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మరింత బలం పుంజుకోనుంది.

గజ్వేల్కు ఒంటేరు

ఇదిలా ఉంటే ఒకవేళ కేసీఆర్ బరిలో దిగితే కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్థన్ పరిస్థితి ఎంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే గంపకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ప్రాధాన్యత ఉన్న పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయనతో చర్చించినట్లు సమాచారం. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఈసారి ఒంటేరు ప్రతాప్ రెడ్డికి అవకాశమివ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది.


Updated : 13 July 2023 7:04 PM IST
Tags:    
Next Story
Share it
Top