Home > తెలంగాణ > మెదక్కు సీఎం కేసీఆర్.. పూర్తి షెడ్యూల్ ఇదే..

మెదక్కు సీఎం కేసీఆర్.. పూర్తి షెడ్యూల్ ఇదే..

మెదక్కు సీఎం కేసీఆర్.. పూర్తి షెడ్యూల్ ఇదే..
X

సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ జిల్లా ఆఫీసును ప్రారంభిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కేసీఆర్ పాల్గొనే మొదటి బహిరంగ సభ ఇదే. దీంతో కేసీఆర్ ఏం మట్లాడతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

బుధవారం ఉదయం 11గంటలకు కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గంలో మెదక్ బయలుదేరుతారు. ఒంటి గంటకు మెదక్ చేరుకుని.. 1.15 నిమిషాలకు బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభిస్తారు.

1.35కు జిల్లా పోలీస్ కార్యాలయం, 1.40 నిమిషాలకు కలెక్టరేట్ను ప్రారంభించనున్నారు. 4 గంటలకు సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 5.30కు తిరిగి ప్రగతిభవన్కు బయలుదేరుతారు.

కాగా ఈ నెల 19న మెదక్లో కేసీఆర్ పర్యటించాల్సి ఉంది. అయితే వర్షాల నేపథ్యంలో పర్యటన వాయిదా పడింది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు, పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు జిల్లా నలువైపుల నుంచి భారీ జన సమీకరణకు ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Updated : 22 Aug 2023 10:53 PM IST
Tags:    
Next Story
Share it
Top