Home > తెలంగాణ > ప్రొ. హరగోపాల్పై దేశద్రోహం కేసులు ఎత్తివేత.. డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశం

ప్రొ. హరగోపాల్పై దేశద్రోహం కేసులు ఎత్తివేత.. డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశం

ప్రొ. హరగోపాల్పై దేశద్రోహం కేసులు ఎత్తివేత.. డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశం
X

పౌరహక్కుల నేత, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్ తో పాటు ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం.. ఉపా కింద నమోదుచేసిన కేసులను ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కేసుల ఎత్తివేతకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ అంజనీకుమార్ను ఆదేశించారు.





ప్రొఫెసర్‌ హరగోపాల్‌తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులపై 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌లో దేశద్రోహం కేసు నమోదైంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్‌, ప్రొఫెసర్‌ పద్మజా షా, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వీ రఘునాథ్‌, చిక్కుడు ప్రభాకర్‌ తదితరుల పేర్లు అందులో చేర్చారు.





మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై హరగోపాల్‌తో పాటు ఇతర ప్రజాసంఘాల నేతలపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎలాంటి తప్పు చేయకపోయినా ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వారిపై నమోదు చేసిన కేసును వెంటనే ఎత్తివేయాలని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అన్ని అంశాలను పరిశీలించిన కేసీఆర్.. హరగోపాల్ సహా ఇతరులపై నమోదు చేసిన కేసుల ఎత్తివేయాలని నిర్ణయించారు.







Updated : 17 Jun 2023 1:21 PM IST
Tags:    
Next Story
Share it
Top