Home > తెలంగాణ > 25 రోజుల తర్వాత బయటికొచ్చిన కేసీఆర్.. నేరుగా నిజామాబాద్కు

25 రోజుల తర్వాత బయటికొచ్చిన కేసీఆర్.. నేరుగా నిజామాబాద్కు

25 రోజుల తర్వాత బయటికొచ్చిన కేసీఆర్.. నేరుగా నిజామాబాద్కు
X

బీఆర్ఎస్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ (76) కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడతూ.. హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి గురువారం తుదిశ్వాస విడిచారు. ఇవాళ జరుగనున్న అంత్యక్రియలు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్ లో నిజామాబాద్ చేరుకున్న (KCR) కేసీఆర్.. అక్కడ నుంచి వేల్పూర్ చేరుకుపి వేముల కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మంజులమ్మ భర్త వేముల సురేందర్‌రెడ్డి టీడీపీ హయాంలో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఛైర్మన్‌గా, టీఆర్ఎస్ (ప్రసుత బీఆర్ఎస్ ) రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2016లో ఆయన మృతి చెందారు.

ఏడాది కాలంగా మంజులమ్మ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో ఆమెకు బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీ నిర్వహించారు. కొన్ని నెలల నుంచి ఆరోగ్యం క్షీణించింది. అప్పటి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. కాగా, గత 25 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్.. ప్రగతిభవన్ కే పరిమితం అయ్యారు. ఏవైనా ముఖ్య కార్యకలాపాలు ఉంటే అక్కడి నుంచే ఆదేశించారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగు పడటంతో.. తిరిగి జనాల్లోకి వచ్చారు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో తిరిగి జోష్ వచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. నియోజక వర్గాల్లో కేసీఆర్ పర్యటన ముఖ్య కానుంది.




Updated : 13 Oct 2023 1:29 PM IST
Tags:    
Next Story
Share it
Top