Home > తెలంగాణ > ‘నా బిడ్డ పద్మ దేవేందర్ రెడ్డి చెప్తే.. ఏదీ కాదన’: సీఎం కేసీఆర్

‘నా బిడ్డ పద్మ దేవేందర్ రెడ్డి చెప్తే.. ఏదీ కాదన’: సీఎం కేసీఆర్

‘నా బిడ్డ పద్మ దేవేందర్ రెడ్డి చెప్తే.. ఏదీ కాదన’: సీఎం కేసీఆర్
X

మెదక్ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ ఆ ప్రాంతానికి వరాల జల్లు కురిపించారు. జిల్లా అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. మెదక్ జిల్లాలో నూతనంగా నిర్మించిన క‌లెక్ట‌రేట్‌, ఎస్‌పీ ఆఫీసుల ప్రారంభోత్స‌వం అనంత‌రం బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్ పలు హామీలిచ్చారు. ‘నా బిడ్డ పద్మ దేవేంద‌ర్ రెడ్డి ఏది చెప్పినా కాదనలేను. దాని ఫలితమే జిల్లాలో కొత్త క‌లెక్ట‌రేట్‌, ఎస్‌పీ ఆఫీసులు. అభివృద్ధికి ప్రత్యేక నిధుల’ని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

దారుణంగా ఉన్న మెదక్ గ్రామ పంచాయితీల బాగు కోసం నిధులు మంజూరు చేశారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా రామాయంపేటకు, కౌడిపల్లికి డిగ్రీ కాలేజీ సాంక్షన్ చేశారు. మెదక్ కు రింగ్ రోడ్డు, ఏడు పాయల గుడికి టూరిజం ప్యాకేజీలో భాగంగా రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు మంజూరు చేశారు. వీటితో పాటు మెదక్ లో ఉన్న 469 గ్రామ పంచాయితీలకు రూ. 15 లక్షల చొప్పున సాంక్షన్ చేశారు. అదే విధంగా మెద‌క్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మిగ‌తా మున్సిపాలిటీల‌కు రూ. 25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు.

Updated : 23 Aug 2023 11:06 PM IST
Tags:    
Next Story
Share it
Top