Home > తెలంగాణ > ఇక్కడి దద్దమ్మ నాయకులే తెలంగాణకు శత్రువులు : సీఎం కేసీఆర్‌

ఇక్కడి దద్దమ్మ నాయకులే తెలంగాణకు శత్రువులు : సీఎం కేసీఆర్‌

ఇక్కడి దద్దమ్మ నాయకులే తెలంగాణకు శత్రువులు : సీఎం కేసీఆర్‌
X

సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకున్న తెలంగాణ నేతలపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. కొందరు నాయకుల వల్లే ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయని అన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాదాపు మూడు నాలుగేండ్ల క్రితమే పూర్తయ్యేదని అయితే కొందరు అడ్డుకోవడం వల్లే అది ఆలస్యమయ్యిందని మండిపడ్డారు. అలా అడ్డుకున్నవాళ్లు ఎక్కడివాళ్లో కాదని మహబూబ్‌నగర్‌లో ఉన్న గత్తరబిత్తిరి నాయకులేనని విమర్శించారు. బయటివారి కన్నా ఇక్కడి దద్దమ్మ రాజకీయ నాయకులే తెలంగాణకు పెద్ద శత్రువులని సీఎం ఆరోపించారు.

సమైక్య పాలనలో జూరాలకు నీరు ఇవ్వలేదన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. వారి హయాంలో ఆర్టీఎస్ను నాశనం పట్టించారని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే మోడీ సర్కారు స్పందించడం లేదని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీకి సిగ్గుశరం ఉంటే కృష్ణా జలాల్లో వాటాలు తేల్చాలని డిమాండ్ చేశారు. 10ఏండ్లుగా రాష్ట్ర బీజేపీ నేతలు ఈ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ఎవరైనా బీజేపీ జెండాలు పట్టుకుని వస్తే ప్రజలు వారిని నిలదీయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.



Updated : 16 Sep 2023 1:32 PM GMT
Tags:    
Next Story
Share it
Top