Home > తెలంగాణ > పాలమూరును గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజార్చారు - కేసీఆర్

పాలమూరును గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజార్చారు - కేసీఆర్

పాలమూరును గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజార్చారు - కేసీఆర్
X

పాలమూరు జిల్లాను గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజార్చిన ఘనత కాంగ్రెస్ నాయకులదేనని కేసీఆర్ అన్నారు. వారి కారణంగానే తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారని మండిపడ్డారు. మంత్రి పదవులు, కాంట్రాక్టులు ఇస్తే తీసుకుని నోరు మూసుకుని ఉన్నారే తప్ప తెలంగాణ కోసం కాంగ్రెస్ నేతలెవరూ పోరాడలేదని విమర్శించారు. నారాయణపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. గత పాలకుల హయాంలో నీళ్లు, కరెంటు కష్టాలు ఉండేవని, కరువు, వలసలతో జనం నానా ఇబ్బందులు పడేవారని అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లలో పరిస్థితి మారిపోయిందని చెప్పారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు.

పాలమూరు నీటి గోస తీర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తైతే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి మంచిపేరు వస్తుందని 183 కేసులు వేశారని ఆరోపించారు. వాటన్నింటినీ అధిగమించి పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించామని చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తదని కేసీఆర్ హెచ్చరించారు. రైతుల కష్టాలు తీర్చేందుకే ధరణిని తీసుకొచ్చామని, అయితే కాంగ్రెస్ వస్తే దాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తామని అంటున్నారని గుర్తుచేశారు. ప్రజలు ఆ పార్టీకి అధికారం కట్టబెడితే రైతు బంధు, 24 గంటల కరెంటు బంద్ అవుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు.

అంతకు ముందు మక్తల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పాల్గొన్నారు. పాలమూరు జిల్లాను నాశనం పట్టించిందే కాంగ్రెస్‌ పార్టీ అని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో పార్టీలు పోటీ చేయడం, గెలుపోటములు సహజమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో పరిణితి రావాలంటే యువత ముందుకు రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.




Updated : 6 Nov 2023 1:16 PM GMT
Tags:    
Next Story
Share it
Top