Home > తెలంగాణ > 5గంటల కరెంటిచ్చే మీరు నీతులు చెప్తరా..?- కేసీఆర్

5గంటల కరెంటిచ్చే మీరు నీతులు చెప్తరా..?- కేసీఆర్

5గంటల కరెంటిచ్చే మీరు నీతులు చెప్తరా..?- కేసీఆర్
X

ఎన్నికల్లో గెలుపు కోసం ఆదరాబాదరా హామీలు ఇస్తలేమని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. ప్రజలు పొరపాటున కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే పరిస్థితి తలకిందులైతదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రైతు బంధు ఇచ్చి ప్రజల సొమ్ము దుబారా చేస్తున్నారని, వ్యవసాయానికి 3 గంటల కరెంటుచాలంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అయితదని, కరెంటు కాట కలుస్తదని, దళిత బంధుకు జై భీం అంటారని కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకు అభ్యర్థుల్నే కాకుండా పార్టీ చరిత్రను చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పైనా కేసీఆర్ సటైర్లు వేశారు. తమ రాష్ట్రంలో కేవలం 5 గంటల కరెంటు ఇస్తున్న ఆయన.. కర్నాటక అభివృద్ధి చూసేందుకు లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీరొచ్చా మాకు నీతులు చెప్పేదని ప్రశ్నించారు. ఇక బీజేపీ తరఫున ప్రచారానికి వచ్చిన యూపీ సీఎం నోటి కొచ్చినట్లు మాట్లాడుతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనిస్తే ఆ రాష్ట్రానికి చెందిన కూలీలు మన దగ్గర వరినాట్లు వేసేందుకు వస్తున్నారని గుర్తు చేశారు.

ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డగోలు హామీలు ఇస్తలేమని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయని, సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తైతే అది 4 కోట్ల టన్నులకు చేరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా మారుతుందని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను మొత్తాన్ని రూ.3వేలు చేస్తామని, విడతలవారీగా రూ.5వేలకు పెంచుతామని చెప్పారు. రైతు బంధు, దళిత బంధు పదాలు పుట్టించిందే తామన్న కేసీఆర్.. గత పాలకులు దళితుల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప వారి కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే తన మానసపుత్రిక పథకమైన దళితబంధు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా అమలు చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

Updated : 2 Nov 2023 4:48 PM IST
Tags:    
Next Story
Share it
Top