Home > తెలంగాణ > యూనిఫాం సివిల్ కోడ్పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

యూనిఫాం సివిల్ కోడ్పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

యూనిఫాం సివిల్ కోడ్పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

యూనిఫాం సివిల్ కోడ్.. ప్రస్తుతం దేశాన్ని హీట్ ఎక్కిస్తోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తుండగా.. ముస్లీం వర్గాలు సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలను విభజించేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖాలీద్ సయీఫుల్లా రెహ్మాని ఆధ్వర్యంలో బోర్డు కార్యవర్గం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమైంది.

భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్రం తీసుకునే నిర్ణయాలను తాము తిరస్కరిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పౌర స్మృతి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. యూసీసీ బిల్లుతో దేశంలో ప్రత్యేక సంస్కృతి కలిగిన గిరిజనులు, పలు మతాలు, జాతులు, ప్రాంతాలతో పాటుగా హిందూ మతాన్ని ఆచరించే ప్రజలు అయోమయానికి లోనవుతున్నారని అన్నారు.

‘‘కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యూసీసీ నిర్ణయం దురుద్దేశంతో కూడుకుందని స్పష్టమవుతోంది. దేశంలో ఎన్నో పరిష్కరించాల్సిన సమస్యలున్నా వాటిని పట్టించుకోకుండా గత తొమ్మిదేళ్లలో దేశ ప్రజల అభివృద్ధిని విస్మరించింది. దేశంలో పనులేమీ లేనట్టు.. ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే యూసీసీ అంటూ మరోసారి విభజన రాజకీయాలకు పాల్పడుతోంది’’ అని కేసీఆర్ అన్నారు.

వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని సీఎం స్పష్టం చేశారు. అంతే కాకుండా భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకుని బిల్లుపై పోరాడుతామన్నారు. ఇందుకు సంబంధించి పార్లమెంటు ఉభయ సభల్లో చేపట్టే కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకోవాలని పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వర్ రావులకు దిశానిర్దేశం చేశారు.

Updated : 10 July 2023 4:45 PM GMT
Tags:    
Next Story
Share it
Top