Home > తెలంగాణ > తెలంగాణకు మరో రాష్ట్రం సాటి రాదు.. సీఎం కేసీఆర్

తెలంగాణకు మరో రాష్ట్రం సాటి రాదు.. సీఎం కేసీఆర్

తెలంగాణకు మరో రాష్ట్రం సాటి రాదు.. సీఎం కేసీఆర్
X

విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో తెలంగాణ స్ఫూర్తి దాయకంగా నిలిచించిందన్న సీఎం కేసీఆర్, కాళేశ్వరం జలాలతో.. పంటల ఉత్పత్తిలో దేశానికే ఆదర్శంగా, అన్నపూర్ణగా తెలంగాణ నిలిచిందన్నారు. 77వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేశారు సీఎం. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల ఆశయాలకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్న కేసీఆర్.. దేశంలో వనరుల వినియోగం సరిగా లేదన్నారు. కొందరు అసమర్థుల వల్ల వనరుల వినియోగం సరిగా జరగట్లేదు అన్నారు. సమైక్య పాలనలో వ్యవసాయ సంక్షేమం ఉండేదన్న సీఎం కేసీఆర్.. తాము అధికారంలోకి రాగానే పంట రుణాలను మాఫీ చేసి... ఇలా రెండుసార్లలో రూ.37వేల కోట్ల రుణమాఫీ చేశామని అన్నారు. రైతు సంక్షేమంలో తెలంగాణకు మరో రాష్ట్రం సాటి రాదని అన్నారు.

"పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పెద్ద అవరోధం తొలగిపోయింది. సత్వరమే సాగునీటి కాల్వల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాం. అతి త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. పాలమూరు- రంగారెడ్డి జిల్లాలో పచ్చని పంటలు వస్తాయి. తాగునీటి అవసరాల కోసం రాబోయే కొద్దిరోజుల్లోనే జలాశయాలకు నీటి ఎత్తిపోతల ప్రారంభిస్తాం. గతంలో ఎటుచూసినా ఆకలి కేకలు.. ఆత్మహత్యలు. గతంలో ఎటు చూసినా పడావు పడ్డ భూములు... తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక యజ్ఞంగా నిర్వహించాం. విధ్వంసమైన తెలంగాణను విజయపథంవైపు నడిపించాం, అనతి కాలంలోనే తెలంగాణ తిరుగులేని విజయాలు సాధించింది. అనేక రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాం. తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోందనే పేరు తెచ్చాం. నేడు తెలంగాణలో నిరంతర విద్యుత్‌ వెలుగులు కనిపిస్తున్నాయి. పంటకాలువలతో.. పచ్చని చేలతో కళకళలాడుతోంది. కాళేశ్వర జీవధారలతో సస్యశ్యామలం అవుతోంది.

రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆశీర్వాదాన్ని ఇలాగే అందించాలి. తలసరి ఆదాయం, విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం నెంబర్‌ వన్‌. విద్యుత్తు రంగంలో రాష్ట్రానిది స్ఫూర్తిదాయక విజయగాథ. గత నెలలో అసాధారణ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టింది. తక్షణ సహాయ చర్యలకు రూ.500 కోట్లు విడుదల చేశాం. ఈసారి వరి సాగు రికార్డు స్థాయిలో ఉంటుందని అంచనా. రైతు సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శం. దశాబ్ద కాలంలో తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతి చూసి యావత్ దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. అద్భుతమైన ఈ పురోగమనం ఇదే రీతిన కొనసాగేలా తెలంగాణ ప్రజలు తమ సంపూర్ణ ఆశీర్వాద బలాన్ని ఇవ్వాలి. రెండు దశల్లో రైతులకు దాదాపు రూ.37 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేశాం. దేశంలో రైతులను ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదు" అని సీఎం అన్నారు.

Updated : 15 Aug 2023 6:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top