Home > తెలంగాణ > ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి నాపై పోటీ చేస్తుండు : కేసీఆర్

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి నాపై పోటీ చేస్తుండు : కేసీఆర్

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి నాపై పోటీ చేస్తుండు : కేసీఆర్
X

కామారెడ్డికి కేసీఆర్ ఒక్కడే రావడంలేదని.. ఆయన వెంట చాలా వస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల తర్వాత కామారెడ్డి రూపురేఖలు మారుస్తామన్నారు. కామారెడ్డికి పరిశ్రమలు సహా ఐటీ కంపెనీలు వస్తాయని చెప్పారు. కామారెడ్డిలో నామినేషన్ తర్వాత నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. కామారెడ్డిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని.. బంగారు కామారెడ్డికి అందరూ కృషి చేయాలని కోరారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి తనపై పోటీ చేస్తున్నారని.. ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు కేసీఆర్. చరిత్ర తెలియని వాళ్లు తెలుసుకుని ఓటెయ్యాలని సూచించారు. గత 50ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణకు చేసిందేమిలేదన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కోసం పుట్టిందని.. ప్రజాసంక్షేమమే తమ పార్టీ ధ్యేయమన్నారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారని.. కానీ వారికి పెన్షన్ ఇస్తుంది తెలంగాణ మాత్రమే అన్నారు.

రైతు బంధు దుబారా, 3గంటల కరెంట్ చాలు అని కాంగ్రెస్ నేతలు అనడం సిగ్గుచేటని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను కాంగ్రెస్ తీసేస్తామంటున్నారని.. ధరణిని తీసేస్తే.. మళ్లీ పైరవీకారుల రాజ్యం వస్తుందన్నారు. ధరణి వల్లే భూమి పంచాయతీలకు చెక్ పడిందని.. దానిని తీసేస్తే రైతుబంధు సొమ్ము ఎలా జమ చేస్తారని అడిగారు. కాంగ్రెస్ నీళ్లు, నిధులు, కరెంట్ ఇవ్వలేదని.. ఆ పార్టీని నమ్మితే మోసపోతారని చెప్పారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలని నిలదీశారు. కామారెడ్డి మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


Updated : 9 Nov 2023 5:47 PM IST
Tags:    
Next Story
Share it
Top