Home > తెలంగాణ > నల్లగొండ ఇంకా నా దత్తతలోనే ఉంది : కేసీఆర్

నల్లగొండ ఇంకా నా దత్తతలోనే ఉంది : కేసీఆర్

నల్లగొండ ఇంకా నా దత్తతలోనే ఉంది : కేసీఆర్
X

బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ శరవేగంగా అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్ అన్నారు. నల్లగొండలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నల్లగొండను పట్టించుకోలేదని ఆరోపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివద్ధి చేశామని చెప్పారు. ఈ ప్రాంతానికి ఐటీ టవర్ కూడా వచ్చిందని గుర్తుచేశారు.

నల్గగొండ నియోజకవర్గం ఇంకా తన దత్తతలోనే ఉందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో పన్నులు కట్టకపోతే దర్వాజలు పీక్కపోయారని ఆరోపించారు. కానీ ప్రజాసంక్షేమాన్ని పట్టించుకున్ననాథుడే లేడన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేశామని చెప్పారు. ఈ పదేళ్లలో తాము చేసిన అభివృద్ధి కళ్ల ముందే కన్పిస్తుందన్నారు. అప్పుడు మంచినీళ్లు, సాగునీరు, కరెంట్ పరిస్థితి ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందో గమనించాలని కోరారు. 50ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నల్లగొండకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదని.. కానీ బీఆర్ఎస్ వల్ల మూడు కాలేజీలు వచ్చాయని అన్నారు.

బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పూర్తైతే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని కేసీఆర్ చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, ధాన్యం కొనుగోలుతో రైతులకు అండగా నిలిచామన్నారు. ఈ సారి అధికారంలోకి వస్తే పెన్షన్లను 5వేలకు పెంచుతామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆగమవుతుందని కేసీఆర్ అన్నారు. రైతు బంధు దుబారా అని ఉత్తమ్.. మూడు గంటల కరెంట్ చాలని రేవంత్ అనడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామంటున్నారని.. ధరణి తీసేస్తే పైరవీకారుల రాజ్యం వస్తదన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి చిరమర్తి లింగయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Updated : 20 Nov 2023 6:39 PM IST
Tags:    
Next Story
Share it
Top