Home > తెలంగాణ > త్వరలో కోటీ 25లక్షల ఎకరాలకు సాగునీరు : సీఎం కేసీఆర్

త్వరలో కోటీ 25లక్షల ఎకరాలకు సాగునీరు : సీఎం కేసీఆర్

త్వరలో కోటీ 25లక్షల ఎకరాలకు సాగునీరు : సీఎం కేసీఆర్
X

తెలంగాణ చరిత్రలో సెప్టంబర్ 17కు ఎంతో ప్రత్యేకత ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో తెలంగాణ భాగమైందని.. ఆ రోజున రాచరిక పాలన ముగిసి ప్రజాస్వామ్య పాలన మొదలైందని చెప్పారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. 1956లో తెలంగాణ ప్రజాభిష్టానికి విరుద్ధంగా ఆంధ్రతో కలిపారని.. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.

తెలంగాణ సాధనతో తన జన్మ సార్థకమైందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ మహోద్యమానికి సారథ్యం వహించడం చరిత్ర తనకు అందించిన గొప్ప అవకాశమన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక పునర్నిర్మాణ కార్యాన్ని సైతం నిబద్ధతతో కొనసాగిస్తున్నట్లు సీఎం చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ప్రభుత్వం నుంచి లబ్ది పొందుతుందని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 13.18 శాతం పేదరికం ఉంటే ఇప్పుడు 5.88 శాతానికి దిగివచ్చిందన్నారు. అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరిలే పాలన సాగిస్తున్నట్లు చెప్పారు.

కోటీ 25లక్షల ఎకరాలకు సాగునీరు..

మానవతా కోణంలో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఆచరిస్తున్నది దేశం అనుసరిస్తుందని అన్నారు. రాష్ట్రంలో 85 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని.. త్వరలో కోటీ 25లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. పాలమూరు పథకం తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా మారుతుందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎక్కువ నష్టపోయింది పాలమూరు జిల్లా అని.. ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుతో జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్ కూడా పూర్తికావొస్తుందన్నారు.

తెలంగాణ నెం.1..

ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి.. ప్రతి ఏటా 10వేల మంది డాక్టర్లను తయారుచేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. దళితబంధుతో దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నామని..

దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదన్నారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లతో పాటు 44లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఆదివాసీలకు అండగా నిలిచి.. పోడుభూములకు పట్టాలివ్వడంతో పాటు రైతు బంధు సైతం ఇస్తున్నామని చెప్పారు. తలసారి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నెం.1 స్థానంలో ఉందన్నారు. తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయి

ఐటీలో మేటీ..

ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ మేటీగా నిలిచిందని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ ఒక మినీ ఇండియా అని.. ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రభుత్వ కృషితో హైదరాబాద్ కు భారీగా పెట్టుబడులు వస్తున్నట్లు చెప్పారు. ఎస్సార్డీపీతో నగరంలో అద్భుతమైన రోడ్డు రవాణా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు,

Updated : 17 Sep 2023 7:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top