Home > తెలంగాణ > ఆ నోట్ల క‌ట్ట‌ల ఆసాముల‌కు ఓట్లతో బుద్ధి చెప్పండి : కేసీఆర్

ఆ నోట్ల క‌ట్ట‌ల ఆసాముల‌కు ఓట్లతో బుద్ధి చెప్పండి : కేసీఆర్

ఆ నోట్ల క‌ట్ట‌ల ఆసాముల‌కు ఓట్లతో బుద్ధి చెప్పండి : కేసీఆర్
X

ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ అరాచకాలే .. మళ్లీ ఆ పాలన మనకెందుకని సీఎం కేసీఆర్ అన్నారు. వైరాలో నిర్వహించిన బీఆర్ఎప్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ రాజ్యంలో భ‌యంక‌ర‌మైన క‌రువు ఉండే అని, ఇవాళ తెలంగాణ‌లో ఆ ప‌రిస్థితి లేదన్నారు. గోదావరి, కృష్ణా నదులున్నా.. సాగునీరు, తాగునీరు ఇవ్వని ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉండేదో.. బీఆర్ఎస్ పదేళ్ల పాలన ఎలా ఉందో ప్రజలు గమనించి ఓటేయ్యాలని సూచించారు.

కాంగ్రెస్ ఎస్టీ, ఎస్సీల‌ను ఓటు బ్యాంకుగా వాడుకుందని కేసీఆర్ ఆరోపించారు. కానీ దళిత బంధుతో దళితులకు అండగా నిలబడింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పారు. రైతు సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట వేసిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు అండగా నిలిచామన్నారు. సితారామ ప్రాజెక్ట్ 70శాతం కంప్లీట్ అయ్యిందని.. అది పూర్తైతే ఖమ్మం జిల్లాలో కరువు అనేదే ఉండదని తెలిపారు. వైరా నియోజకవర్గంలో 40వేల ఎకరాలకు సాగునీళ్లు అందుతాయని చెప్పారు.

ఖమ్మం జిల్లాలో కొంత‌మంది అహంకారులు ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్న‌ారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. వాళ్ల నోట్ల క‌ట్ట‌లు హైద‌రాబాద్‌లో దొరుకుతున్న‌ాయని విమర్శించారు. డ‌బ్బు అహంకారంతో బీఆర్ఎస్ పార్టీ నేతలను అసెంబ్లీ గ‌డ‌ప తొక్క‌నీయమంటున్నారని.. అది వాళ్లు కాదు ప్రజలు నిర్ణయించాలన్నారు. ఈ నోట్ల క‌ట్ట‌ల ఆసాముల‌కు.. కోట్ల విలువైన మీ ఓటుతోనే బుద్ది చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Updated : 21 Nov 2023 11:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top