Home > తెలంగాణ > తండాలకు త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చేందుకు కృషి : కేసీఆర్

తండాలకు త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చేందుకు కృషి : కేసీఆర్

తండాలకు త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చేందుకు కృషి : కేసీఆర్
X

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి కంటిన్యూగా జరుగుతూనే ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. గత 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉండేదో.. బీఆర్ఎస్ పదేండ్ల పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. మ‌హ‌బూబాబాద్ బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ ప్రసంగించారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని ప్ర‌తి మారుమూల ప్రాంతంలో వ్యవసాయానికి త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పాలనలోనే పల్లెలు, తండాలు ప్రశాంతంగా ఉన్నాయని వివరించారు.

ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో 20వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని కేసీఆర్ చెప్పారు. పోడు పట్టాలతో పాటు రైతు బంధు, రైతు బీమా కూడా ఇచ్చామని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చింది కాబట్టే మహబూబాబాద్‌ జిల్లా అయ్యిందని.. లేకపోతే జన్మలో అవ్వకపోతుండే అని అన్నారు. తమ పాలనలో మహబూబాబాద్ రూపురేఖలే మారిపోయాయని చెప్పారు. అప్పటి అప్పటి మహబూబాబాద్‌కు ఇప్పుడున్నదానికి పోలిక లేదన్నారు. మ‌హ‌బూబాబాద్‌కు ఇంజినీరింగ్ కాలేజీ వ‌చ్చిందని. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని విద్యాసంస్థ‌లు వ‌స్తాయని తెలిపారు.

మహబూబాబాద్ జిల్లాలోని తండాలు ధనలక్ష్మీ, ధాన్యలక్ష్మీతో కళకళలాడుతున్నాయని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఉత్తమ్ రైతు బంధు వేస్ట్ అంటుండు.. రేవంత్ కరెంట్ మూడు గంటలు చాలు అంటున్నారని వారు అధికారంలోకి వస్తే రాష్ట్రం ఆగమవుతుందని చెప్పారు. ఓట్ల కోసం ఆ పార్టీ నాయకులు కల్లబొల్లి కబుర్లు చెప్తారని.. వాటిని నమ్మకుండా అభివృద్ధి చేసే పార్టీకి ఓటెయ్యాలని సూచించారు.


Updated : 27 Oct 2023 6:20 PM IST
Tags:    
Next Story
Share it
Top