Home > తెలంగాణ > పాలేరులో దళితులందరికీ దళిత బంధు ఇస్తాం : కేసీఆర్

పాలేరులో దళితులందరికీ దళిత బంధు ఇస్తాం : కేసీఆర్

పాలేరులో దళితులందరికీ దళిత బంధు ఇస్తాం : కేసీఆర్
X

కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీం పాడుతారని సీఎం కేసీఆర్ అన్నారు. ఉత్తమ్ రైతు బంధు వేస్ట్.. రేవంత్ కరెంట్ మూడు గంటలు చాలు అంటారని.. అటవంటి కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మోద్దని సూచించారు. పాలేరు ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. పాలేరు 40ఏళ్లు కరువుతో అల్లాడిందని.. బీఆర్ఎస్ వచ్చాక ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం కరువు పీడ తొలగిపోతుందని చెప్పారు.

పాలేరులో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గం మొత్తం దళితబంధు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా దళితబంధు వంటి పథకం లేదన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టుతో భూముల ధరలు పెరిగాయని చెప్పారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని తెలిపారు. నరంలేని నాలుకతో కొందరు ఏదేదో మాట్లాడుతారని.. ఎవరేది మాట్లాడిన ప్రజలకు వాస్తవాలు తెలుసని అన్నారు.

పిచ్చి రాజకీయాలు చేసేవారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని కేసీఆర్ అన్నారు. డబ్బు, అహంకారంతో ఓట్లు అడిగేవాళ్లకు అవకాశం ఇవ్వొద్దని.. మంచి చేసేవారికే ప్రజలు ఓటెయ్యాలని సూచించారు. దశలవారీగా పెన్షన్ను 5వేలకు పెంచడం సహా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ను గెలిపిస్తే రాష్ట్రం మళ్లీ ఆగమవుతుందని.. బీఆర్ఎస్ గెలిస్తేనే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని చెప్పారు.


Updated : 27 Oct 2023 4:32 PM IST
Tags:    
Next Story
Share it
Top