Home > తెలంగాణ > ఎవరి కొంప ముంచడానికి మళ్లీ ఇందిరమ్మ రాజ్యం : కేసీఆర్

ఎవరి కొంప ముంచడానికి మళ్లీ ఇందిరమ్మ రాజ్యం : కేసీఆర్

ఎవరి కొంప ముంచడానికి మళ్లీ ఇందిరమ్మ రాజ్యం : కేసీఆర్
X

అభివృద్ధిలో బీఆర్ఎస్కు.. కాంగ్రెస్కు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తం అంటున్నారని.. కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిరాజ్యమేలిందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యమే బాగుంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టి 2కే కిలో బియ్యం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. మళ్లీ అటువంటి పాలన ఎవరి కొంప ముంచడానికి అని నిలదీశారు. వేములవాడ బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని సూచించారు. ఓటేసేటప్పుడు ప్రజలు ఆలోచించి వేయాలని కోరారు.

రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని కేసీఆర్ తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, ధాన్యం కోనుగోలు కేంద్రాలతో వారికి అండగా నిలిచామన్నారు. రైతులకు ఇచ్చే సాగునీటిపై గతంలో నీటి తీరువాను వసూలు చేసేవారని, తాము అధికారంలోకి వచ్చినంక నీటిపై పన్నును రద్దు చేశామని చెప్పారు. తెలంగాణలో ఇన్ని రకాలుగా మేం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే.. కాంగ్రెస్ ఇప్పుడు వచ్చి ఇందిరమ్మ రాజ్యం అంటున్నారని విమర్శించారు.

దేశంలో 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కేసీఆర్ అన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ 24గంటల కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అని రేవంత్ అనడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతం వేస్తామంటున్నారని.. ధరణిని తీసేస్తే మళ్లీ పైరవీకారుల రాజ్యం వస్తుందని అన్నారు. ధరణి ఉండడం వల్లే రైతు బంధు నిధులు సకాలంలో జమవుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఇప్పడిప్పుడే బాగుపడుతుందని.. ఈ సమయంలో కాంగ్రెస్ కు అధికారం ఇస్తే అంతా ఆగమవుతుందని అన్నారు. కాబట్టి అభివృద్ధి చేసే చల్మెడ లక్ష్మీనరసింహారావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Updated : 26 Nov 2023 6:22 PM IST
Tags:    
Next Story
Share it
Top