Home > తెలంగాణ > రైతు బంధు, దళితబంధు పథకాలను పుట్టిచ్చిందే నేను : కేసీఆర్

రైతు బంధు, దళితబంధు పథకాలను పుట్టిచ్చిందే నేను : కేసీఆర్

రైతు బంధు, దళితబంధు పథకాలను పుట్టిచ్చిందే నేను : కేసీఆర్
X

రైతు బంధు, దళితబంధు పథకాలను పుట్టిచ్చిందే తాను అని సీఎం కేసీఆర్ అన్నారు. గత కాంగ్రెస్ రాజ్యం ఎలా ఉండేదో.. ప్రస్తుత బీఆర్ఎస్ రాజ్యం ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. వర్ధన్నపేటలో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని.. వర్ధన్నపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టుతో వర్ధన్నపేటకు నీళ్లందించినట్లు వివరించారు.

కొందరికి తెలంగాణపై పెత్తనం మాత్రమే కావాలని.. ఇక్కడి ప్రజల బాగోగులు అవసరం లేదని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ నేతలు రైతుబంధు వద్దంటున్నారని.. ధరణిని తీసేస్తామంటున్నారని ఆరోపించారు. ధరణిని తీసేస్తే భూమి పంచాయతీలు మళ్లీ మొదటికి వస్తాయన్నారు. రైతు బంధు వద్దంటున్నవాళ్లకు ప్రజలే సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ అబద్ధాలకు మోసపోవద్దు.. ఆగం కావొద్దని కేసీఆర్ సూచించారు.

క‌రెంట్, సాగు, తాగునీటి స‌మ‌స్య‌ల‌ను శాశ్వ‌తంగా ప‌రిష్కారించుకున్నామని కేసీఆర్ చెప్పారు. ఏ కులాన్ని, ఏ వ‌ర్గాన్ని వ‌దిలిపెట్ట‌కుండా అంద‌రికీ న్యాయం చేసేలా ముందుకుసాగామన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ను గెలపించాలని కోరారు. ఈ సారి అధికారంలోకి వచ్చాక దశలవారీగా పెన్షన్ను 5వేలకు పెంచుతామని తెలిపారు. మేనిఫెస్టోలో ఉన్న హమీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ను గెలిపిస్తే రాష్ట్రం మళ్లీ ఆగమవుతుందని.. బీఆర్ఎస్ గెలిస్తేనే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని చెప్పారు.


Updated : 27 Oct 2023 6:27 PM IST
Tags:    
Next Story
Share it
Top