Home > తెలంగాణ > రేపు అమరజ్యోతిని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

రేపు అమరజ్యోతిని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

రేపు అమరజ్యోతిని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
X

తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగానికి గుర్తుగా నిర్మించిన అమర జ్యోతి ప్రారంభానికి సిద్ధమైంది. నగరం నడిబొడ్డున నిర్మించిన ఈ అమర జ్యోతిని శుక్రవారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. 12 తుపాకులతో అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత అమరజ్యోతిని ప్రారంభిస్తారు. అనంతరం సీఎం ప్రసంగించనున్నారు. అమరజ్యోతి ప్రారంభం నేపథ్యంలో సాయంత్రం 5గంటల నుంచి అంబేడ్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు 6వేల మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 800 డ్రోన్లతో ప్రదర్శన ఉంటుంది. అమరజ్యోతిపై లేజర్ షో ఉంటుంది.

ఒకవైపు హుస్సేన్‌సాగర్‌, మరోవైపు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సెక్రటేరియట్‌ మధ్య అమరజ్యోతిని నిర్మించారు. రూ.177.50 కోట్లు ఖర్చుతో నిర్మించిన ఈ నిర్మాణాన్ని పూర్తిగా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. 3.29 ఎకరాల విస్తీర్ణంలో స్మారకం ఏర్పాటుచేయగా అందులో 2.88 లక్షల చదరపు అడుగుల్లో భవనం నిర్మించారు బిల్డింగ్ లో మ్యూజియం, ఆడియో విజువల్ హాల్, 650 మంది సీటింగ్ కెపాసిటీతో కన్వెన్షన్ సెంటర్, రెస్టారెంట్, ఇతర సౌకర్యాల కల్పించారు. 350 వాహనాల కోసం పార్కింగ్ సదుపాయం ఉంది. హుస్సేన్‌సాగర్‌ అందాలు, బుద్ధ విగ్రహం, బిర్లామందిర్‌, అంబేద్కర్‌ విగ్రహం, సచివాలయం తదితర నిర్మాణాలు కనిపించేలా టెర్రస్‌పై రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు.





Updated : 21 Jun 2023 9:03 PM IST
Tags:    
Next Story
Share it
Top