Home > తెలంగాణ > 15న నాందేడ్కు కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్..

15న నాందేడ్కు కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్..

15న నాందేడ్కు కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్..
X

సీఎం కేసీఆర్ గురువారం మరోసారి మహారాష్ట్ర వెళ్లనున్నారు. ఆ రాష్ట్రంలో నిర్మించిన తొలి బీఆర్ెస్ భవనాన్ని ప్రారంభించనున్నారు. నాగపూర్‌లో సువిశాలమైన స్థలంలో బీఆర్ఎస్ కొత్త భవనం నిర్మించారు. ఈ నెల 15న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ దాన్ని ప్రారంభిస్తారు. 15న ఉదయం నాగపూర్‌ వెళ్లనున్న కేసీఆర్‌.. పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.

మహారాష్ట్రలో పార్టీని విస్తరించే ప్రయత్నంలో ఉన్న కేసీఆర్ ఇతర నగరాల్లోనూ పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముంబై, పుణె, ఔరంగాబాద్‌లోనూ బీఆర్ఎస్ కార్యాలయాలు త్వరలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనువైన భవనాల కోసం వెతుకుతున్నారు మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల నియామక కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. మరోవైపు ఈ నెల 19న నాందేడ్‌లో రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన ఇది జరగనుంది.

Updated : 13 Jun 2023 10:50 AM IST
Tags:    
Next Story
Share it
Top