Home > తెలంగాణ > గద్వాలకు కేసీఆర్.. కలెక్టరేట్ బిల్డింగ్ ప్రారంభించనున్న సీఎం

గద్వాలకు కేసీఆర్.. కలెక్టరేట్ బిల్డింగ్ ప్రారంభించనున్న సీఎం

గద్వాలకు కేసీఆర్.. కలెక్టరేట్ బిల్డింగ్ ప్రారంభించనున్న సీఎం
X

సీఎం కేసీఆర్ ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ బిల్డింగ్ తో పాటు ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గద్వాలలోని అయిజ రోడ్డులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో గద్వాల్ పట్టణం గులాబీమయంగా మారింది.

సాయంత్రం 4.30గంటలకు సీఎం కేసీఆర్ హలికాప్టర్ ద్వారా గద్వాలకు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయాయి. సమీకృత కలెక్టర్‌ కార్యాలయం, ఎస్పీ ఆఫీస్, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి, కలెక్టర్‌ క్రాంతి, ఎస్పీ సృజనతో కలిసి పరిశీలించారు.

గద్వాలకు కేసీఆర్.. కలెక్టరేట్ బిల్డింగ్ ప్రారంభించనున్న సీఎంగద్వాల్ జిల్లా కేంద్రంలోని అయిజ రోడ్డు తెలంగాణ చౌరస్తా సమీపంలోని గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాకు గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలు, వాటి అమలు తీరు, పనుల పురోగతిని సీఎం ప్రజలకు వివరించనున్నారు. ప్రగతి నివేదన సభ ముగిసిన అనంతరం 8 గంటలకు కేసీఆర్ రోడ్డుమార్గాన హైదరాబాద్కు తిరుగుప్రయాణం అవుతారు.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సిఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రతివారం జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారు. ఆయా జిల్లాలకు గతంలో ఇచ్చిన హామీల అమలు గురించి వివరిస్తున్నారు.

Updated : 12 Jun 2023 9:33 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top