Home > తెలంగాణ > భారీ కాన్వాయ్తో సోలాపూర్కు చేరుకున్న సీఎం కేసీఆర్..

భారీ కాన్వాయ్తో సోలాపూర్కు చేరుకున్న సీఎం కేసీఆర్..

భారీ కాన్వాయ్తో సోలాపూర్కు చేరుకున్న సీఎం కేసీఆర్..
X

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ సోలాపూర్ చేరుకున్నారు. ఆయన రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ఉండనున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కేసీఆర్ మహారాష్ట్రకు బయలుదేరారు. రెండు ప్రత్యేక బస్సులు, భారీ కార్ల కాన్వాయ్‌తో మధ్యాహ్నం ధారాశివ్‌ జిల్లా ఒమర్గాకు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ భోజనం చేశారు. సాయంత్రానికి సోలాపూర్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్కు బీఆర్‌ఎస్‌ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇవాళ రాత్రి సీఎం కేసీఆర్‌ సోలాపూర్‌లోనే బస చేయనున్నారు.

మంగళవారం ఉదయం 8 గంటలకు కేసీఆర్ పండరీపురానికి వెళ్లి అక్కడ రుక్మిణీ సమేత విఠేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం సోలాపూర్‌ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుతారు. మంగళవారం సీఎం సమక్షంలో పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. ఆ తర్వాత ధారాశివ్‌ జిల్లాలోని శక్తిపీఠం తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసిన తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యే, సీనియర్‌ బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.

Updated : 26 Jun 2023 8:53 PM IST
Tags:    
Next Story
Share it
Top