Home > తెలంగాణ > CM KCR Suryapet Tour : రేపు సూర్యాపేటలో పర్యటించనున్న సీఎం కేసీఆర్..

CM KCR Suryapet Tour : రేపు సూర్యాపేటలో పర్యటించనున్న సీఎం కేసీఆర్..

CM KCR Suryapet Tour : రేపు సూర్యాపేటలో పర్యటించనున్న సీఎం కేసీఆర్..
X

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం సూర్యాపేటకు చేరుకోనున్న కేసీఆర్.. తొలుత బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ చేయనున్నారు. అనంతరం పట్టణంలోని కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ ఆఫీసుతో పాటు మెడికల్ కాలేజ్, వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పోలీస్ కార్యాలయం, నీటి శుద్ధి కర్మగారాలను సీఎం ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కొత్త మార్కెట్ యార్డ్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.

హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవే పక్కనున్న కొత్త మార్కెట్ యార్డ్ సమీపంలో దాదాపు 70ఎకరాల్లో సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్‌ రాక కోసం ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ, కొత్త మార్కెట్ యార్డ్ వద్ద హెలిప్యాడ్‌ సిద్ధం చేస్తున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ మీటింగ్ కోసం భారీ సంఖ్యలో జన సమీకరణ చేస్తున్నారు.





సూర్యాపేట పట్టణంలో 23 కిలోమీటర్ల మేర సీఎం కేసీఆర్​ పర్యటన సాగనుంది. ఈ మేరకు అధికారులు, పోలీసులు ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్దం చేశారు. హెలికాప్టర్ లో సూర్యాపేట ఎస్వీ డిగ్రీ కాలేజీకి చేరుకోనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బీ‌ఆర్‌ఎస్ ఆఫీస్ ప్రారంభించిన అనంతరం ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఓపెనింగ్ చేస్తారు. అక్కడి నుంచి ఖమ్మం రోడ్, పీఎస్‌ఆర్ సెంటర్ మీదుగా కొత్త వ్యవసాయ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొంటారు. అనంతరం మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ చేరుకొని పార్టీ నాయకులతో మీటింగ్​ నిర్వహిస్తారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభించి అక్కడి నుండి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం పర్యటన సందర్భంగా 3వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.




Updated : 19 Aug 2023 8:20 PM IST
Tags:    
Next Story
Share it
Top