Home > తెలంగాణ > వీఆర్ఏల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌, స‌ర్దుబాటుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

వీఆర్ఏల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌, స‌ర్దుబాటుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

వీఆర్ఏల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌, స‌ర్దుబాటుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
X

వీఆర్ఏల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌, స‌ర్దుబాటుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై ఆయన సచివాలయంలో స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. వీఆర్ఏల విద్యార్థతల ఆధారంగా వారిని నాలుగు శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు నీటి పారుదల, పుర‌పాల‌క శాఖ‌, పంచాయ‌తీరాజ్ శాఖ్, మిష‌న్ భ‌గీర‌థ శాఖ‌లో వీఆర్ఏల‌ను స‌ర్దుబాటు చేయ‌నున్నారు. 61 ఏండ్లు దాటిన వీఆర్ఏల ఉద్యోగాన్ని వారి వార‌సుల‌కు ఇవ్వాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. వీఆర్ఏల స‌ర్దుబాటు, ఇత‌ర అంశాల‌కు సంబంధించిన జీవో సోమ‌వారం విడుద‌ల‌య్యే ఛాన్సుంది.

వీఆర్‌ఏల సర్దుబాటు, క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా నీటిపారుదల శాఖ, మిషన్‌ భగీరథలకే ఎక్కువ మందిని మళ్లించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 23,046 వీఆర్‌ఏ పోస్టులుండగా ప్రస్తుతం 21,433 మంది విధుల్లో ఉన్నారు. క్రమబద్ధీకరణ అనంతరం పేస్కేల్‌ కింద ఎంత మొత్తం చెల్లించాలనేది ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయిస్తుంది. వీఆర్‌ఏలలో పీజీ, డిగ్రీ తదితర ఉన్నత విద్య పూర్తి చేసిన వారు దాదాపు 5వేల మంది ఉన్నారు. నీటిపారుదల శాఖలో సహాయకుల కింద 1,034 మందిని, లష్కర్ల కింద 4,374 మందిని, 3వేల మందిని మిషన్‌ భగీరథలో నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం.మిగిలిన వారిలో కొందరిని పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల్లోకి తీసుకునే అవకాశముంది.




Updated : 23 July 2023 8:50 PM IST
Tags:    
Next Story
Share it
Top