Home > తెలంగాణ > రేపు చింతమడకకు కేసీఆర్.. ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

రేపు చింతమడకకు కేసీఆర్.. ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

రేపు చింతమడకకు కేసీఆర్.. ఏర్పాట్లు పరిశీలించిన సీపీ
X

తెలంగాణలో రేపు జరగనున్న పోలింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం కేసీఆర్ చింతమడకలో తన ఓటు హక్కును వినియోగంచుకోనున్నారు. గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు. ఈ క్రమంలో గ్రామంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనర్ శ్వేత చింతమడకలో ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, పోలింగ్ కేంద్రాలను పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాగా ప్రతిసారి స్వగ్రామంలోనే కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకుంటారు.

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్కు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రజలు పెద్దఎత్తున ఓటింగ్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటోంది. పోలింగ్ కేంద్రాలను జియో ట్యాగింగ్ చేశారు. పలుచోట్ల డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.


Updated : 29 Nov 2023 5:56 PM IST
Tags:    
Next Story
Share it
Top