Home > తెలంగాణ > TS elections: నేడు సెంటిమెంట్ గుడికి సీఎం కేసీఆర్

TS elections: నేడు సెంటిమెంట్ గుడికి సీఎం కేసీఆర్

TS elections: నేడు సెంటిమెంట్ గుడికి సీఎం కేసీఆర్
X

సీఎం కేసీఆర్ నేడు సిద్దిపేట జిల్లాలోని కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకొని, ప్రత్యేక పూజలు చేయనున్నారు. నామినేషన్ వేసే ముందు ఈ ఆలయంలో ప్రత్యేక పూజ చేయించడం కేసీఆర్ కు సెంటిమెంట్. బీఆర్ఎస్ వరుస సభలు, మధ్యలో యాగంలాంటి కార్యక్రామాల బిజీ షెడ్యూల్ వల్ల ఈసారి కాస్త ముందుగానే ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ఈసారి ఆయన గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లో బరిలో దిగుతుండగా.. నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్ వేస్తారు.

కాగా ఈ ఆలయం కేసీఆర్ కు ఎప్పటినుంచో సెంటిమెంట్ గా ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా మొదట ఇక్కడ పూజలు చేసిన తర్వాతే నామినేషన్లు వేస్తారు. వెంకటేశ్వర స్వామి దగ్గర నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపిన తర్వాతే నామినేషన్ వేస్తారు. ఈ నేపథ్యంలో ఈ పురాతన ఆలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించారు కేసీఆర్. కాగా ఈ గుడిలో పూజించిన ప్రతీసారి కేసీఆర్ గెలుపొందారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ పూజలు జరిపాకే నామినేషన్ వేస్తారు.

Updated : 4 Nov 2023 8:01 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top