Home > తెలంగాణ > కాంగ్రెస్ గెలిస్తే గల్లీకో పేకాట క్లబ్ తెరుస్తారు.. సీఎం కేసీఆర్

కాంగ్రెస్ గెలిస్తే గల్లీకో పేకాట క్లబ్ తెరుస్తారు.. సీఎం కేసీఆర్

కాంగ్రెస్ గెలిస్తే గల్లీకో పేకాట క్లబ్ తెరుస్తారు.. సీఎం కేసీఆర్
X

కాంగ్రెస్‌ హయాంలో ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు ఉండేవని, గోదావరి ఒడ్డున ఉన్న ప్రాంతాలకూ కాంగ్రెస్‌ సాగు, తాగు నీరు ఇవ్వలేకపోయిందన్నారు సీఎం కేసీఆర్. మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో పాల్గొన్న కేసీఆర్ దివాకర్ రావుకు మ‌ద్ద‌తుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మంచిర్యాలలో కాంగ్రెస్ గెలిస్తే గల్లీకో పేకాట క్లబ్ తెరుస్తారన్నారు. 1969లో 400 మంది తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపారని.. ఎమ్మెల్యేలను కొని టీఆర్ఎస్ ను చీల్చాలని కాంగ్రెస్‌ చూసిందన్నారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో అన్నట్లు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడానని కేసీఆర్ తెలిపారు

రైతుబంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ , బీఆర్ఎస్ అని అన్నారు. భారతదేశంలో రైతుబంధు ఎక్కడా లేదని అన్నారు. దురదృష్ట వశాత్తూ.. ఎవరైనా రైతు చనిపోతే రూ.5లక్షలు కుటుంబానికి వారంలోగా అందుతున్నాయని... రైతులు పండించే ధాన్యంలో గింజకూడా లేకుండా రాష్ట్రంలో మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నది అని సీఎం అన్నారు. ధరణి తీసేసి భూమాత పెడతామని కాంగ్రెస్​ నేతలు చెబుతున్నారని.. వారు పెట్టేది భూమాత కాదు భూమేత అని ఎద్దేవా చేశారు. ధరణి తీసేస్తే రైతుబంధు, ధాన్యం డబ్బులు, రైతుబీమా ఎలా అందుతాయని ప్రశ్నించారు. ధరణిని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

"పీసీసీ అధ్యక్షుడు .. కరెంటు వేస్ట్‌గా కేసీఆర్‌ 24గంటల కరెంటు ఇస్తున్నడు. 24 గంటలు అవసరం లేదు. మూడు గంటలు చాలు అంటున్నడు. మూడుగంటల కరెంటు సరిపోతుందా? 24 గంటల కరెంటు కావాలంటే దివాకర్ రావు గెలవాలి" అని అన్నారు. కాంగ్రెస్ అంటేనే దళారుల రాజ్యమని, కాంగ్రెస్ గెలిచాక కర్ణాటకలో ఏం జరుగుతుందో అందిరికీ తెలుసని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వస్తే కర్ణాటక పరిస్థితులేనన్నారు.




Updated : 24 Nov 2023 2:40 PM IST
Tags:    
Next Story
Share it
Top