Home > తెలంగాణ > తెలంగాణను అన్నీ రకాలుగా ఏడిపించింది కాంగ్రెస్సే.. సీఎం కేసీఆర్

తెలంగాణను అన్నీ రకాలుగా ఏడిపించింది కాంగ్రెస్సే.. సీఎం కేసీఆర్

తెలంగాణను అన్నీ రకాలుగా ఏడిపించింది కాంగ్రెస్సే.. సీఎం కేసీఆర్
X

ఎన్నికల సమయంలో రాయి ఏదో రత్నం ఏదో గుర్తించాలని కేసీఆర్ అన్నారు. ఆలోచించి ఓటు వేయండి.. లేకపోతే ఐదు ఏండ్లు ఆగం అవుతారని చెప్పారు. బీఆర్ఎస్ మీ కళ్ల ముందే పుట్టిందని, ఏం చేసిందో చూశారని తెలిపారు. వరంగల్ లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ఓటు వేసేటప్పుడు అభ్యర్థులనే కాదు.. వాళ్ల వెనకున్న పార్టీలను చూడాలని కేసీఆర్ సూచించారు. పొరపాటున కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అన్యాయం జరుగుతదని, పదేళ్లుగా జరిగిన అభివృద్ధి మళ్లీ వెనక్కి పోతదని హెచ్చరించారు. చెప్పుడు మాటలు నమ్మి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించవద్దని చెప్పారు.

ఆలోచించి ఓటేయకపోతే ఐదేళ్లు నష్టపోతరని చెప్పారు. ఏ ప్రభుత్వం అమల్లోకి వస్తే.. మంచిదో చర్చించి ఓటేయండని కోరారు. 50ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనను పది ఏండ్ల బీఆర్ఎస్ పాలనను బేరీజు వేసుకోవాలన్నారు కేసీఆర్ . భారత దేశంలో మొట్టమెదటి సారి రైతుబంధు పుట్టిందే.. కేసీఆర్, బీఆర్ఎస్ నుంచి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం ఒక్క బీఆర్ఎస్ కే తెలుసని చెప్పారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతుబంధు, 24గంటల కరెంట్ వేస్ట్ అని విమర్శిస్తున్నారు. వాళ్లు చేసే విమర్శలు కరెక్టేనా అని ప్రశ్నించారు.

డిసెంబర్ 3 తర్వాత బీఆర్ఎస్ అధికారంలో వచ్చాక.. రాష్ట్రంలో ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నవారికి పట్టాలిస్తామని, వంద శాతం ఇండ్ల జాగాలు ఇస్తామని కేసీఆర్ అన్నారు. చిన్నబోయిన వరంగల్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివ‌ృద్ధి చేస్తామని చెప్పారు. కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ లో లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. రైల్వే లైన్‌పై కనీసం ఆరు బ్రిడ్జిలు రావాలని, ఈసారి అధికారంలోకి వస్తే ట్రాఫిక్ కట్టడి కోసం 6 బ్రిడ్జీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Updated : 28 Nov 2023 8:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top