Home > తెలంగాణ > Revanth Reddy : కుమారి ఫుడ్ స్టాల్ మార్పుపై స్పందించిన సీఎం

Revanth Reddy : కుమారి ఫుడ్ స్టాల్ మార్పుపై స్పందించిన సీఎం

Revanth Reddy : కుమారి ఫుడ్ స్టాల్ మార్పుపై స్పందించిన సీఎం
X

సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాందించిన కుమారి ఆంటీకి రాష్ర్ట ప్రభుత్వం అండగా నిలిచింది. కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు చెప్పారు సీఎం సీపీఆర్ఓ అయోధ్య రెడ్డి. పాత స్థలంలోనే ఫుడ్ స్టాల్ కొనసాగించుకోవాడానికి పరిమిషన్ ఇచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. ప్రజాపాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని...త్వరలోనే కుమారి స్టాల్ ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి ఫుడ్ టెస్ట్ చేస్తారని అయోధ్య రెడ్డి ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో తన మాటలతో ఎంతో పాపులారిటీ సంపాందించుకుంది కుమారి ఆంటీ. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ కి సామాన్యులు క్యూ కట్టారు. కుమారి ఆంటో స్టాల్ ఎదుట ప్రజలు బారులు తీరడంతో..ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుందని కొందరు ట్రాఫిక్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఫుడ్ స్టాల్ ను ఇక్కడ పెట్టవద్దని, స్ఠలాన్ని వెంటనే మార్చాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పోలీసుల అలా చెప్పడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై స్పందించిన రేవంత్ సర్కార్ ఆమెకి గుడ్ న్యూస్ చెప్పింది. పాత స్థలంలోనే ఫుడ్ స్టాల్ కొనసాగించుకోవచ్చని ఆమెకి సూచించింది.



Updated : 31 Jan 2024 2:08 PM IST
Tags:    
Next Story
Share it
Top