Home > తెలంగాణ > తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..

తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..

తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..
X

సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో తొలి లోక్ సభ అభ్యర్థిని ప్రకటించారు. మహబూబ్ నగర్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డిని రేవంత్ ప్రకటించారు. వంశీ చంద్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఆయన దూరంగా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ గెలుపుకు వంశీ చంద్ కృషి చేశారు.

యుద్ధం ముగియలేదు..

అంతకుముందు మాట్లాడిన రేవంత్.. కాంగ్రెస్ యుద్ధం ఇంకా ముగియలేదని.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడమే తమ లక్ష్యమని అన్నారు. ఏ ప్రాజెక్టులు పూర్తి చేశారని కేసీఆర్ ఓట్లడుగుతారని రేవంత్ ప్రశ్నించారు. 2009లో పాలమూరు ప్రజలు కేసీఆర్ను పార్లమెంట్ పంపిస్తే.. ఇక్కడి ప్రాంతానికి చేసిందేమి లేదని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీరివ్వలేదని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు పేరు చెప్పి ఇక్కడి ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు.

రాష్ట్రంలో త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. వచ్చే నెల 15లోపు అందరికీ రైతు బంధు నిధులు జమచేస్తామని చెప్పారు. అదేవిధంగా వారం రోజుల్లో 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలిండర్ హామీలను అమలు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా రూ.2లక్షల రుణమాఫీని సైతం త్వరలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Updated : 21 Feb 2024 8:14 PM IST
Tags:    
Next Story
Share it
Top