Home > తెలంగాణ > గిగ్‌ వర్కర్లకు గుడ్‌న్యూస్‌.. ప్రమాద బీమా కల్పిస్తూ ఉత్తర్వులు

గిగ్‌ వర్కర్లకు గుడ్‌న్యూస్‌.. ప్రమాద బీమా కల్పిస్తూ ఉత్తర్వులు

గిగ్‌ వర్కర్లకు గుడ్‌న్యూస్‌.. ప్రమాద బీమా కల్పిస్తూ ఉత్తర్వులు
X

ఓలా, ఉబర్, గిగ్ వర్కర్స్ కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 23న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో గిగ్ వర్కర్స్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు మూడున్నర లక్షల మంది గిగ్ వర్కర్స్ కు ఈ ప్రమాద బీమా అందనుంది. గిగ్ వర్కర్స్ తో జరిగిన భేటీలో.. క్యాబ్, ఆటో డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ కోసం బీమా తీసుకొస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో ఉత్తర్వులు వెలువడ్డాయి.

అంతేకాకుండా గిగ్ వర్కర్ల కోసం టీ హబ్ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్లకోసం యాప్ ను తీసుకొస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజాపాలన గ్రామ సభల్లో గిగ్‌ వర్కర్లు తమ వివరాలతో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంపై గిగ్ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు 4 నెలల క్రితం కుక్క తరమడంతో బిల్డింగ్ పై నుంచి పడి మృతి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ రిజ్వాన్ కుటుంబానికి సీఎం ఇవాళ రూ.2 లక్షల ఆర్ధిక సాయం అందజేశారు.


Updated : 30 Dec 2023 3:31 PM GMT
Tags:    
Next Story
Share it
Top