Home > తెలంగాణ > రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ శంకుస్థాపన

రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ శంకుస్థాపన

రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ శంకుస్థాపన
X

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల కారణంగానే ఇవాళ ప్రపంచాన్ని మన గుప్పట్లో పెట్టుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ సమగ్రతను కాపాడటానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. సచివాలయానికి సమీపంలో రాజీవ్ విగ్రహ ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆయన విగ్రహం అందరిలో స్పూర్తి నింపుతుందని ఆయన పెర్కోన్నారు. ఓ వైపు సచివాలయం, మరోవైపు అమరవీరుల స్థూపం ట్యాంక్‌బండ్‌పై ఎందరో త్యాగమూర్తుల విగ్రహాలు ఉన్నాయని, దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన ఆదర్శ నాయకుడి విగ్రహం సచివాలయ పరిసరాల్లో లేకపోవడం లోటుగా కనిపించిందని సీఎం పేర్కొన్నారు. ఆ లోటును తీర్చడానికి భారీ స్థాయిలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. సోనియా గాంధీ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ భారీ స్థాయిలో చేయనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆర్ అండ్ బి అధికారులు ప్రత్యేక శ్రద్దతో విగ్రహ తయారీపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. నాటి రాజీవ్‌ పాలనలో తీసుకున్న నిర్ణయాలు దేశంలో ఐటీ రంగానికి బలమైన పునాదులు వేశాయని సీఎం తెలిపారు. రాజీవ్‌ గాంధీని స్పూర్తిగా తీసుకుని తెలంగాణను ఐటీరంగంలో మరింత ప్రగతిపథంలో వెళ్లేలా కృషి చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. సత్వరమే ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఈరోజు ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్నామంటే దానికి రాజీవ్‌గాంధీ పాలన సంస్కరణలే అని వెల్లడించారు. దేశ యువతకు రాజీవ్‌ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.


Updated : 14 Feb 2024 2:47 PM GMT
Tags:    
Next Story
Share it
Top