Home > తెలంగాణ > Revanth Reddy : మేడిగడ్డ చేరుకున్న రేవంత్ టీం.. కాసేపట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్

Revanth Reddy : మేడిగడ్డ చేరుకున్న రేవంత్ టీం.. కాసేపట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్

Revanth Reddy : మేడిగడ్డ చేరుకున్న రేవంత్ టీం.. కాసేపట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
X

తెలంగాణలో జల రాజకీయం సాగుతోంది. ప్రాజెక్టులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఇరుకున పెడితే.. కేఆర్ఎంబీ అంటూ బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ వెళ్లారు. మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిన పిల్లర్లను రేవంత్ బృందం పరిశీలిస్తోంది. కుంగిన పిల్లర్లపై అధికారులు సీఎం సహా ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు. మేడిగడ్డపై కాసేపట్లో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

అంతకుముందు తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని రేవంత్ ట్వీట్ చేశారు. రూ. 97 వేల కోట్లు వ్యయంతో కడితే 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని విమర్శించారు. ‘‘ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదు.. పూర్తిగా పునర్ నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నం ప్రజా ప్రతినిధుల ఇవాళ్టి మేడిగడ్డ పర్యటన’’ అని రేవంత్ ట్వీట్ చేశారు.

Updated : 13 Feb 2024 10:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top