Home > తెలంగాణ > మెట్రో రెండోదశ విస్తరణ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం

మెట్రో రెండోదశ విస్తరణ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం

మెట్రో రెండోదశ విస్తరణ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం
X

మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు. శంషాబాద్‌ విమానాశ్రయాన్ని కలుపుతూ 70 కి.మీ. పొడవునా విస్తరణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. రెండో దశ కారిడార్‌ కోసం వేగంగా ట్రాఫిక్‌ సర్వేలు, డీపీఆర్‌ల తయారీ చేపడుతున్నట్లు వివరించారు. రెండో దశ కారిడార్‌లో మెట్రో సేవలు అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో పెట్టుబడులను ఆకర్షించేందుకు మెట్రో సేవలు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం మెట్రో 69 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో అందుబాటులో ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ టు రాయదుర్గం, మియాపూర్ టు ఎంజీబీఎస్ కారిడార్లలో ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వం రూపొందించిన విస్తరణ ప్రణాళికలను రేవంత్ సర్కార్ పక్కనబెట్టింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో కనెక్టివిటీ రీచ్‌ అయ్యేలా కొత్త రూట్‌ను డిజైన్‌ చేశారు. కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉండేలా రూపొందించారు.


Updated : 26 Jan 2024 9:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top