Home > తెలంగాణ > రాజ్ భవన్లో ఎట్ హోం.. హాజరైన సీఎం రేవంత్

రాజ్ భవన్లో ఎట్ హోం.. హాజరైన సీఎం రేవంత్

రాజ్ భవన్లో ఎట్ హోం.. హాజరైన సీఎం రేవంత్
X

హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్‌ తమిళిసై తేనేటి విందు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎట్ హోంకు హాజరైన ప్రతి ఒక్కరిని గవర్నర్ తమిళిసై ఆత్మీయంగా పలకరించారు. సీఎం సహా మంత్రులతో ఆమె నవ్వుతూ మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది.

అంతుకుముందు రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన వేడుకల్లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ఆమె టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ప్రారంభమైందని, నిరుద్యోగులు త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని చెప్పారు. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే తమ లక్ష్యమని.. ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందని చెప్పారు. ‘మహాలక్ష్మి’ కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు. దావోస్‌ సదస్సులో రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్లు వివరించారు.


Updated : 26 Jan 2024 4:02 PM GMT
Tags:    
Next Story
Share it
Top