Home > తెలంగాణ > రేవంత్ లక్కీ నెంబర్.. సచివాలయంలో ఛాంబర్ మార్పు!

రేవంత్ లక్కీ నెంబర్.. సచివాలయంలో ఛాంబర్ మార్పు!

రేవంత్ లక్కీ నెంబర్.. సచివాలయంలో ఛాంబర్ మార్పు!
X

తెలంగాణ నూతన సచివాలయంలో మార్పులు జరుగుతున్నాయి. సీఎం ఛాంబర్ విషయంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సచివాలయంలోని తన ఛాంబర్ను మరో చోటుకు మార్చే పనిలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం ఛాంబర్ ఆరో ఫ్లోర్లో ఉంది. దానిని తొమ్మిదో ఫ్లోర్కు మార్చే ప్రక్రియ జరుగుతోంది. ఇవాళ రేవంత్ తొమ్మిదో ఫ్లోర్ను పరిశీలించారు. రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9 కావడంతో తొమ్మిదో ఫ్లోర్లో సీఎం ఛాంబర్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఛాంబర్లో అవసరమైన ఇంటీరియర్ డిజైనింగ్, ఫర్నీచర్ను అధికారులు రెడీ చేస్తున్నారు.

కాగా గత నెల 7న సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ సీఎం అయినప్పటీ నుంచి సచివాలయంలో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు శాఖలపై రివ్యూలు చేపట్టి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. మరోవైపు ప్రగతి భవన్కు ప్రజాభవన్ పేరు పెట్టి.. డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా మార్చారు. ఈ క్రమంలోనే సీఎం ఛాంబర్ను సైతం మారుస్తుండడం గమనార్హం.

Updated : 6 Jan 2024 6:20 PM IST
Tags:    
Next Story
Share it
Top