Home > తెలంగాణ > తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం - సీఎం రేవంత్

తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం - సీఎం రేవంత్

తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం - సీఎం రేవంత్
X

తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ లేవనెత్తిన అనుమానాలపై ఆయన స్పందించారు. వైట్ పేపర్ ద్వారా వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశామని రేవంత్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఆర్బీఐ, కాగ్ నుంచి సమాచారం తీసుకున్నామని, అవసరమైన చోట ఆ సంస్థల నివేదికలను ప్రస్తావించామని చెప్పారు.

2014 -15 ఆర్థిక సంవత్సరంలో 300 రోజులు మిగులు నిధులున్నాయని ఆర్బీఐ చెప్పిన విషయాన్ని సీఎం రేవంత్ గుర్తు చేశారు. కానీ గత ఐదేళ్లలో కనీసం 150 రోజులు కూడా మిగులు నిధులు లేవని చెప్పారు. గత ప్రభుత్వం వాస్తవాలు దాచి గొప్పలు చెప్పుకున్నందునే ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. జీతాలు ఆలస్యం కావడంతో ఉద్యోగుల సిబిల్ స్కోర్ దెబ్బతింటోందని, బ్యాంకులు అప్పులు ఇవ్వడంలేదని రేవంత్ చెప్పారు.

వాస్తవాలు కఠోరంగా ఉన్నా వాటిని అంగీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కుటుంబసభ్యులు చేసినా తప్పును తప్పు అనే చెప్పాలని అన్నారు. వాస్తవాలు కొందరికి చేదుగా ఉంటే.. మరికొందరి కళ్లు తెరిపించవచ్చని చెప్పారు. గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వితండవాదాన్ని, దాడులు చేస్తామనే ధోరణి వదలుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు.

Updated : 20 Dec 2023 6:01 PM IST
Tags:    
Next Story
Share it
Top