Home > తెలంగాణ > ఎయిర్పోర్ట్ మెట్రో, ఫార్మా సిటీ రద్దుపై సీఎం క్లారిటీ

ఎయిర్పోర్ట్ మెట్రో, ఫార్మా సిటీ రద్దుపై సీఎం క్లారిటీ

ఎయిర్పోర్ట్ మెట్రో, ఫార్మా సిటీ రద్దుపై సీఎం క్లారిటీ
X

ఎయిర్పోర్ట్ మెట్రో , ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ప్రజా ప్రయోజనాలను దృష్ట్యా స్ట్రీమ్ లైన్ చేస్తున్నట్లు చెప్పారు. శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని సీఎం స్పష్టం చేశారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి ఎయిర్పోర్టుకు 32 కి.మీ దూరం ఉంటుందన్న ఆయన.. ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, చాంద్రాయణ గుట్ట వద్ద ఎయిర్ పోర్టుకు వెళ్లే మెట్రో లైన్‌కు లింక్ చేయనున్నట్లు చెప్పారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం, మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని స్పష్టం చేశారు. కొత్తగా ప్రతిపాదించనున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం చెప్పిన రూట్ కన్నా తక్కువ ఖర్చులోనే పూర్తవుతాయని రేవంత్ చెప్పారు.

ఫార్మాసిటీ, రింగ్ రోడ్, రీజినల్‌ రింగ్ రోడ్ మధ్య ఎలాంటి కాలుష్యం లేకుండా ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. స్పెషల్ క్లస్టర్ల వద్ద పరిశ్రమల్లో పనిచేసే వారి కోసం ఇళ్ల నిర్మాణంతో పాటు కార్మికులు హైదరాబాద్‌ వరకు రాకుండా అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు స్పెషల్ యూనివర్సిటీలు, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా శిక్షణ ఇప్పిస్తామని అన్నారు.

Updated : 1 Jan 2024 2:03 PM GMT
Tags:    
Next Story
Share it
Top