Home > తెలంగాణ > రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు
X

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇంటింటా కొత్త కాంతులు వెల్లివిరియాలన్నారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని ఆకాంక్షించారు. తెలంగాణలో మొదలైన ప్రజా పాలనలో స్వేచ్ఛా సౌభాగ్యాలతో ప్రజలు సంతోషంగా పండుగ సంబురాలు జరుపుకోవాలని అన్నారు. సకల జన హితానికి, ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హామీ ఇచ్చారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో ఆయన భేటీ అయ్యారు. కేంద్ర మంత్రితో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడిన రేవంత్.. కేసీ వేణుగోపాల్ తో తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించారు. ఇవాళ ఆయన ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు.


Updated : 13 Jan 2024 1:18 PM GMT
Tags:    
Next Story
Share it
Top