Home > తెలంగాణ > పాతదోస్తును కాపాడేందుకే అక్బరుద్దీన్ ఆరోపణలు - సీఎం రేవంత్ రెడ్డి

పాతదోస్తును కాపాడేందుకే అక్బరుద్దీన్ ఆరోపణలు - సీఎం రేవంత్ రెడ్డి

పాతదోస్తును కాపాడేందుకే అక్బరుద్దీన్ ఆరోపణలు - సీఎం రేవంత్ రెడ్డి
X

ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తమను అణిచివేసే ప్రయత్నం చేస్తోందన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అక్బరుద్దీన్ సహచర ఎమ్మెల్యేలను గౌరవించాలన్న రేవంత్.. సభలో కొత్తగా ఎన్నికైన వారు 57 మంది ఉన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ చేసిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. ఎంఐఎం ఓ పార్టీ అని, దానికి అక్బరుద్దీన్ అధినేత మాత్రమే తప్ప ముస్లింలందరికీ ప్రతినిధి కారని అన్నారు. తమకు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడా లేదని రేవంత్ స్పష్టం చేశారు. మైనార్టీని రాష్ట్రపతి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతమని అన్నారు.

బీఆర్ఎస్ హయాంలో కరెంటు కోతలు లేవనడం శుద్ధ అబద్దమని రేవంత్ అన్నారు. ఇక మొండిబకాయిల విషయంలో సిద్ధిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్, ఎంఐఎం వేరు కాదని స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ముస్లింలను ఓడించడానికి ఎంఐఎం పనిచేయలేదా అని ప్రశ్నించారు. అసలు బీఆర్ఎస్ తరఫున ఎంఐఎం ఎందుకు వకాల్తా పుచ్చుకుంటుందో అర్థం కావడంలేదన్న రేవంత్.. పాత దోస్తును కాపాడేందుకే అక్బరుద్దీన్ కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని రేవంత్ స్పష్టం చేశారు.

Updated : 21 Dec 2023 11:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top