Home > తెలంగాణ > రేవంత్ సంచలన నిర్ణయం.. ఆ కేసులన్నీ ఎత్తివేత

రేవంత్ సంచలన నిర్ణయం.. ఆ కేసులన్నీ ఎత్తివేత

రేవంత్ సంచలన నిర్ణయం.. ఆ కేసులన్నీ ఎత్తివేత
X

తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. కాగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమ కారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని నిర్ణయించారు. 2009 డిసెంబర్ 12 నుంచి 2014 జూన్ 2 వరకు ఉద్యమకారులపై ఉన్న అన్ని కేసుల వివరాలు తమకు అందించాలని రాష్ట్ర డీజీపీని రేవంత్ రెడ్డి కోరారు. ఆ వివరాలనుబట్టి ప్రభుత్వం త్వరలోనే కేసులను ఎత్తివేయనుంది. కాగా ఉద్యమ సమయంలో చాలామందిపై అక్రమ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావం జరిగి ఇన్నేళ్లైనా ఆ కేసులు ఇప్పటికీ అలానే ఉన్నాయి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తేయనున్నారు.

Updated : 8 Dec 2023 8:18 PM IST
Tags:    
Next Story
Share it
Top