Home > తెలంగాణ > హామీ నెరవేర్చి.. మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి

హామీ నెరవేర్చి.. మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి

హామీ నెరవేర్చి.. మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తానిచ్చిన హామీని నెరవేర్చారు. శనివారం (డిసెంబర్ 30) స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. హైదరాబాద్ లో స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న రిజ్వాన్.. డ్యూటీ చేస్తూ నాలుగు నెలల క్రితం ప్రమాదం జరిగింది. కుక్క బారి నుంచి తప్పించుకోబోయి బిల్డింగ్ పై నుంచి పడి మృతిచెందాడు. ఇటీవల నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రైండ్ లో గిగ్ వర్కర్స్ తో జరిగిన సమావేశంలో రిజ్వాన్ ప్రస్తావన వచ్చింది. ఆ కుటుంబం వివరాలు తెలుసుకుని.. రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం అధికారులకు సూచించారు. ఆరోజు ఇచ్చిన హామీ మేరకు శనివారం.. సచివాలయంలో రిజ్వాన్‌ కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2లక్షల చెక్కును అందజేశారు.




Updated : 30 Dec 2023 7:39 PM IST
Tags:    
Next Story
Share it
Top