Home > తెలంగాణ > దోచుకున్నది దాచుకునేందుకే బీఆర్ఎస్ పనిచేసింది - సీఎం రేవంత్ రెడ్డి

దోచుకున్నది దాచుకునేందుకే బీఆర్ఎస్ పనిచేసింది - సీఎం రేవంత్ రెడ్డి

దోచుకున్నది దాచుకునేందుకే బీఆర్ఎస్ పనిచేసింది - సీఎం రేవంత్ రెడ్డి
X

కాంగ్రెస్ గెలుపులో నిరుద్యోగుల పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎంతో పోరాటం చేశారని, కొందరు అమరులయ్యారని అన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్.. గురుకుల టీచర్స్, లైబ్రేరియన్స్ పోస్టులకు ఎంపికైన 2వేల మందికి అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు. ఉద్యోగ నియామకాల్లో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల ఉద్యోగాలు ఊడగొడితేనే ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయని అన్నారు. నియామక పత్రాలు ఇస్తుంటే తనకు నిజమైన సంతోషం కలుగుతోందని చెప్పారు.

బీఆర్ఎస్ పాలనలో ఏ పరీక్షను సరిగా నిర్వహించలేకపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు. వారి హయాంలో క్వశ్చన్ పేపర్లను జీరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నరని మండిపడ్డారు. ఇకపై యూపీఎస్సీ తరహాలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పేదల కోసం పనిచేస్తుంటే మామ అల్లుడు, తండ్రీ కొడుకు తిడుతున్నారన్న ఆయన.. 2004 స్ఫూర్తితోనే ఇప్పుడు పనిచేస్తున్నామని అన్నారు. అప్పట్లో ప్రజలకిచ్చిన రుణమాఫీ, ఫ్రీ కరెంటు, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపునకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరవడంపైనా సీఎం రేవంత్ స్పందించారు. కూతవేటు దూరంలో ఉన్న అసెంబ్లీకి రావడానికి చాతకావడంలేదుగానీ, 150 కిలోమీటర్ల దూరంలోని నల్గొండకు వెళ్లేందుకు చేతనవుతుందా అని ప్రశ్నించారు. రైతు బిడ్డ సీఎం కుర్చీలో కూర్చుంటే కేసీఆర్ కళ్లు మండుతున్నాయని, అందుకే సభకు రావడం లేదని సీఎం విమర్శించారు.

గత ప్రభుత్వం దోచుకున్నది దాచుకునేందుకు పనిచేసిందే తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదని రేవంత్ ఆరోపించారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి కనీసం లక్ష ఎకరాలకు కూడా నీళ్లవ్వలేకపోయారని సటైర్ వేశారు. గత పాలకుల దోపిడీని ప్రజలకు చూపేందుకే మేడిగడ్డ వెళ్లానని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ వాస్తు కోసం పాత సెక్రటేరియెట్ కూలగొడితే ఇప్పుడు మనకు అక్కరకు వచ్చిందని, 10 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదని 70 రోజుల్లో చేసి చూపించామని అన్నారు. రేషనలైజేషన్ పేరుతో స్కూళ్లు మూయించిన కేసీఆర్.. కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండు నెలలు కాకముందే విమర్శలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Updated : 15 Feb 2024 5:56 PM IST
Tags:    
Next Story
Share it
Top