Home > తెలంగాణ > CM Revanth Reddy:నలుగురి ఉద్యోగాలు పోయినందుకు 2 లక్షల ఉద్యోగాలు రానున్నాయి..

CM Revanth Reddy:నలుగురి ఉద్యోగాలు పోయినందుకు 2 లక్షల ఉద్యోగాలు రానున్నాయి..

CM Revanth Reddy:నలుగురి ఉద్యోగాలు పోయినందుకు 2 లక్షల ఉద్యోగాలు రానున్నాయి..
X

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ లో నిర్వహించిన సింగరేణి ఉద్యోగుల నియామక సభలో సీఎం రేంత్ రెడ్డి పాల్గొన్నారు. 441 మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నామన్నారు. అభ్యర్థులు పరీక్షల తేదీల గురించి ఆలోచించకుండా ప్రిపేర్ కావాలన్నారు. తొందర్లోనే 15 వేల పోలీస్ ఉద్యోగాల నియామకానికి జీవో విడుదల చేస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని లక్షల మంది నిరుద్యోలు ఉద్యోగాల కోసం వేచి ఉన్నారని, వారందరి కోసం త్వరలోనే గ్రూప్ వన్, పోలీస్ రిక్రూట్మెంట్ చేపడతామని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కు సింగరేణి కార్మికులు బుద్ధి చెప్పారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాఫ్ నర్సు ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశామని తెలిపారు. నలుగురి ఉద్యోగాలు తీస్తే నాలుగు వందల మందికి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. తొందర్లోనే సింగరేణిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపడతామని అన్నారు. సింగరేణి ఉద్యోగుల వయోపరిమితి పై తొందర్లోనే నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు.

Updated : 7 Feb 2024 9:03 PM IST
Tags:    
Next Story
Share it
Top