Home > తెలంగాణ > మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
X

హైదరాబాద్ లో మెట్రో విస్తరణపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిసారించింది. మెట్రో రైలు లైన్ పొడగింపు, ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. మంగళవారం (జనవరి 2) అధికారులతో సమీక్ష నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో మెట్రో విస్తరణ.. మియాపూర్ నుంచి రామచంద్రాపురంకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో రైలు పొడగింపుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో ఇవాళ మెట్రో అధికారులతో కూడా రేవంత్ సమీక్ష నిర్వహించారు. అంతకుముందు నీతి అయోగ్ వైస్ చైర్మన్, సుమన్ భేరి, సభ్యులు వీకే సారస్వత్ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు.

Updated : 2 Jan 2024 4:29 PM IST
Tags:    
Next Story
Share it
Top