Home > తెలంగాణ > ఫార్మాసిటీపై స్పష్టమైన ఆలోచనతో ముందుకు.. : Revanth Reddy

ఫార్మాసిటీపై స్పష్టమైన ఆలోచనతో ముందుకు.. : Revanth Reddy

ఫార్మాసిటీపై స్పష్టమైన ఆలోచనతో ముందుకు.. : Revanth Reddy
X

తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఔటర్‌ రింగ్ రోడ్డు లోపల ప్రాంతం అర్బన్‌ క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్‌ - ఆర్ఆర్‌ఆర్‌ మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్‌ క్లస్టర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ప్రాంతమంతా రూరల్‌ క్లస్టర్‌గా విభజిస్తామన్నారు. ఓఆర్‌ఆర్‌కు 14 రేడియల్‌ రోడ్లు, 12 హైవేల కనెక్టివిటీ ఉందన్నారు. భారత పారిశ్రామిక సమాఖ్య ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్మాసిటీపై ప్రభుత్వం స్పష్టమైన ఆలోచనతో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ తరహాలో రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తామన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానించేలా ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం అమలు చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అన్ని రంగాల కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహాలు ఇస్తామన్నారు. ఒకే చోట ఫార్మాసిటీ కాకుండా ఫార్మా విలేజీలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలని ఆకాంక్షించారు. సుదీర్ఘ లక్ష్యంతో మెగా మాస్టర్‌ పాలసీ రూపకల్పన చేస్తున్నాట్లు చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారి ప్రతి పైసాకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామిక అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా.. అన్ని ప్రాంతాల్లో జరగాలని తెలిపారు.

Updated : 6 Jan 2024 7:41 PM IST
Tags:    
Next Story
Share it
Top